




EO TEST (141) P REVIOUS PAPERS:

































010. Accounts Test for Subordinate Officers Part-II (WITH BOOKS)
1.A.P.Treasury Code, Volume - I, Part -II (Chapter I, II,IV, VI, VIII, IX and V) and part III (Chapter I-III)
2.The A.P. Treasury Code, Volume - II (Omitting Appendices 1-9, 12, 13, 16, 17)
3.The A.P.Account Code, Volume - II
4.An Introduction to the Indian Government Accounts and Audit
107. Departmental Test for Persons in the Ministerial Service of the Forest Department Part-I, Paper-I (WITH BOOKS)
125. Departmental Test for Persons in the Ministerial Service of Forest Department Part-I, Paper-II (WITHOUT BOOKS)
1.A.P.Accounts Code Vol.III Part -III, Articles 240-297
2.A.P.Forest Act I of 1967 with the rules in the Madras Forest Manual - I (1940 edition) new rules are framed under Act -I of 1967 made thereunder and all the amendments issued from time to time.









EO TEST 141 MATERIAL ( with out weter mark)
GO TEST 88 MATERIAL (WITH OUT ANY WATER MARK)
GO TEST 97 - PART 1 PART -2 (WITH OUT ANY WATER MARK)
DEPARTMENTAL TEST MOCK TEST ( ONLINE MODEL TESTS)



EOT 141 EXAMS ANALYSIS






ఏపీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఇలా..
>ఒకే విద్యార్హతతో పలు పరీక్షలు రాసుకోవచ్చు. అయితే ప్రకటనలు వెలువడిన ప్రతిసారీ వివరాలు నమోదు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారమే...వన్ టైమ్ రిజిస్ట్రేషన్...ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన కొత్త విధానం.
>ఒక్కసారి వివరాలు నమోదుచేస్తే చాలు. మీ అర్హతతో ఉన్న ఉద్యోగాలన్నింటికీ ఆ సమాచారమే సరిపోతుంది. టీఎస్‌పీఎస్సీ గత ఏడాదే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
>ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కూడా ఈ పద్ధతినే ఆచరిస్తోంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హతలకు తగ్గ ప్రకటన వెలువడగానే మొబైల్ ఫోన్లు, ఈ-మెయిళ్లకు సమాచారం వచ్చేస్తుంది.
@నమోదు చేయండిలా...
>ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ (http:/psc.ap.gov.in) లోకి వెళ్లగానే అందులో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
>వెంటనే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ టెస్ట్ అని రెండు ట్యాబ్‌లు వస్తాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎంచుకుని కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.
>అప్పుడు ఓటీఆర్ దరఖాస్తు వస్తుంది. అందులో అభ్యర్థులు వివరాలను పొందుపరచాలి. పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృ భాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు, ఉద్యోగం చేసినా లేదా చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు - ఒకటో తరగతి నుంచి డిగ్రీ/ డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్, పి.హెచ్.డి వరకు ఉత్తీర్ణత తేదీ, సంవత్సరం, హాల్ టికెట్ నంబర్లతో సహా తెలియజేయాల్సి ఉంటుంది.
>ఇంకా ఏవైనా అదనపు విద్యార్హతలు ఉంటే యాడ్ క్వాలిపికేషన్ బటన్ క్లిక్‌చేసి వివరాలు నమోదుచేయాలి.
>ప్రతి స్థాయిలో (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఇతర అన్ని పరీక్షలలో) వచ్చిన మార్కుల వివరాలను శాతంలో గానీ గ్రేడ్ రూపంలో గానీ తెలియజేయాలి.
>ఐడెంటిఫికేషన్ గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్నవాటినే పేర్కోవాలి. ఆధార్‌కార్డు ఉంటే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
అన్ని సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుని వివరాలు నమోదుచేయాలి.
@ఫొటో, సంతకం
>పై సమాచారాన్నంతటినీ పొందుపరిచాక చివరగా జేపీఈజీ ఫార్మాట్ 50 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం.మీ నిలువు పరిమాణంలో కలర్ లేదా బ్లాక్- వైట్‌లో ఉన్న మీ ఫొటోని అప్‌లోడ్ చేయాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి.
>చివరగా మీ పూర్తి- పొడుగు సంతకాన్ని బ్లాక్ ఇంకు పెన్నుతో రాసి దాన్ని కూడా జేపీఈజీ ఫార్మాట్ 30 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 1.5 సెం.మీ నిలువు సైజులో అప్‌లోడ్ చేయాలి. దీంతో ఓటీఆర్ వివరాలన్నింటినీ పొందుపరచినట్లే!
>ఆ తత్వాత నోటిపికేషన్ అలెర్ట్ కింద టిక్ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రకటనలు వెలువడినప్పుడు ఆ సమాచారం మీ మొబైల్, మెయిల్ ఐడీలకు వస్తుంది. ఉద్యోగ సమాచారం పొందాలనుకున్నవాళ్లు టిక్ మార్కు గుర్తించడం తప్పనిసరి.
>అనంతరం మీరు పొందుపరచిన వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని డిక్లరేషన్ ఓకే చేస్తే మీరు పొందుపర్చిన వివరాల ప్రివ్యూ లభిస్తుంది. దీని హార్డ్‌కాపీని ప్రింట్ తీసుకోవాలి. మరోసారి సరిచూసుకుని తర్వాత Send అని పంపాలి. ఈ హార్డుకాపీని మీ సర్టిఫికెట్లతోపాటు భద్రపరచుకోవాలి.
>ఈ వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గల సమాచారం ఆధారంగా (డేటాబేస్) సరిచూసుకుని ధ్రువీకరించుకున్న తరువాత ఏపీపీఎస్‌సీ అభ్యర్థుల సెల్‌ఫోన్, ఈ-మెయిల్‌కు పదంకెల పాస్‌వర్డ్/ రిజిస్టర్ ఐడీని పంపుతుంది. ఈ పాస్‌వర్డ్ సాయంతో అభ్యర్థులు సర్వీస్ కమిషన్ నుంచి వివిధ నోటిఫికేషన్ల వివరాలను సులువుగా పొందవచ్చు.
అజాగ్రత్త వద్దు
కంప్యూటర్‌లో సమాచారాన్ని ఇచ్చేటపుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరీక్ష సన్నద్ధతకు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఉదాహరణకు గతంలో Do you come under creamy layer అన్నచోట Yes అని క్లిక్ చేసి బీసీ రిజర్వేషన్ సదుపాయాన్ని కోల్పోయిన వారున్నారు. అందుకే దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలనూ పాటించాలి. ఓటీఆర్ చివరన అభ్యర్థి డిక్లరేషన్‌లో ఏదైనా తప్పు సమాచారం ఉంటే ఏపీపీఎస్‌సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నట్లు ఉంది. కాబట్టి కచ్చితమైన, నిజ సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారాన్ని ఇవ్వకూడదు.
అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి
Ø పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి
Ø రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు
Ø మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి తెలియజేయాలి
Ø 10 నిమిషాల ముందు మీరు "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది
లాగిన్ ఐడి = రోల్ నంబర్
పాస్ వర్డ్ = పరీక్ష రోజు ఇవ్వబడుతుంది
Ø ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే 1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.
Ø ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును
Ø లాగిన్ అయిన తరువాత తెరపై ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్ లో మీ వివరాలు చెక్ చేసుకొని Confirm పై క్లిక్ చేయాలి.
Ø Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత
I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
Ø ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి మౌస్ ను మాత్రమే వాడాలి
Ø ఈ ఆన్ లైన్ పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో అది సూచిస్తుంది.
Ø మీ యొక్క ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది
White (Square) - మీరు ప్రయత్నించని ప్రశ్నలు
Red(Inverted Pentagon) -మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు
Green (Pentagon) - మీరు జావాబులు పూర్తి చేసిన ప్రశ్నలు
Violet (Circle) - ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు ( marked for Review)
Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించార
కాని Review కొరకు మార్క్ చేశారు
Ø ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
Ø Review & Next బటన్ నొక్కిన ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది
Ø ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి
Ø SECTION NAME పై కర్సర్ ను ఉంచిన ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .
Ø ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్ సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.
Ø PWD అభ్యర్ధులకు 120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది
Ø ఏ విధంగానైనా system log out అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.
Ø పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
Ø ఎట్టి పరిస్థితిలో key board ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.
డిపార్ట్ మెంటల్ టెస్ట్ - ఆన్ లైన్ పరీక్షా విధానము
డిపార్ట్ మెంటల్ టెస్ట్ కు సంబంధించిన EO (141) పరీక్షపై ఒక విశ్లేషణ
*EO పరీక్ష పాసవ్వడం కష్టమా?*
ఎక్కువమంది EO పరీక్షను కష్టంగా భావిస్తారు. అయితే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే EO పరీక్ష పాసవ్వడం కష్టం కాదు.
EO పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు సగటున 1ని 20సె మాత్రమే కేటాయించబడింది.
*EO పరీక్షలో కష్టతరమైన అంశాలు:*
Pension Problems,
Constitution of India లో Articles ను, Budget manuel అంశాలలో ఉన్న పేరాలను గుర్తించి రాయవలసి ఉంటుంది.
అలాగే Head of Accounts, Tresury Rules కష్టంగా భావిస్తాం.
*EO పరీక్ష ఎలా పాసవ్వాలి?*
*ముందుగా సిలబస్:*
AP Treasury Code,
AP Financial Code,
AP Budget Manual,
AP Pension Code,
Constitution of India,
వీటితో పాటు వర్తమానాంశాలు ప్రిపేర్ అవ్వాలి.
మన దగ్గర Text Books(Bare Acts) ఉంటే ప్రిపేర్ కాకుండా పాసవ్వవచ్చా?
EO పరీక్షకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్కటి 100 లేదా 100కు పైగా పేజీలను కలిగి ఉన్నాయి. అన్ని పేజీలలో ఉన్న బిట్స్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకని ముందుగా టెక్స్ట్ బుక్స్ లో ఉన్న బిట్ అంశాలను గుర్తించి ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేసుకుంటే మంచిది.
*EO పరీక్ష ఎలా ప్రిపేర్ కావాలి?*
ముందుగా ఏవైనా గత పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నా పత్రాలను వాటి సమాధానాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వీటిలో 5 నుండి 10 బిట్లు వస్తున్నాయి.
*TOPIC WISE ప్రిపరేషన్:*
1) APTC FORMS కు సంబంధించి 7 నుండి 10 బిట్లు వస్తాయి.
2) APFC FORMS కు సంబంధించి 4 నుండి 5 బిట్లు వస్తాయి.
3) HEAD OF ACCOUNTS కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
4) PENSION RULES కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
5) PENSION PROBLEMS కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.
చాలా మంది వీటిని కష్టతరంగా భావిస్తున్నారు.
అయితే పెన్షన్ లో SERVICE PENSION, NORMAL FAMILY PENSION, ENHANCED FAMILY PENSION, GRATUITY అంశాలను ప్రిపేర్ అయితే వీటికి ఈజీగా సమాధానాలను గుర్తించవచ్చు.
6) TREASURY RULES కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.
7) AP FINANCIAL CODE కు సంబంధించి 7 నుండి 8 బిట్లు వస్తాయి.
8) AP BUDGET MANUAL కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.
9) CONSTITUTION OF INDIA కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
10) PF RULES కు సంబంధించి 3 నుండి 4 బిట్లు వస్తాయి.
11) వీటితో పాటు వర్తమానాంశాలైన CPS, PRC, APGLI కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.
వీటిని క్షుణ్ణంగా ప్రిపేర్ అయినట్లయితే ఈ మార్కులను ఈజీ గా సంపాదించవచ్చు.
*మెటీరియల్ ఆధారంగా పైన వివరించిన టాపిక్ ల ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ అయినట్లయితే ఈజీ గా EO పరీక్షను పాసవ్వవచ్చు.*